మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జూన్ 2024 (19:59 IST)

ఏడాది వయస్సున్న బిడ్డను హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?

Baby boy
భార్య తనను మోసం చేసిందని.. ఏడాది వయస్సున్న తన బిడ్డకు తాను తండ్రి కాదనే అనుమానంతో తన కుమారుడిని యూపీకి చెందిన వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

గురువారం అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని గుర్తించిన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనపై రూపైదిహ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సంషేర్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ, "తల్లి తన భర్త సుజిత్‌ హత్యకు పాల్పడినట్లు ఆరోపించింది. ఏడాది వయస్సున్న కుమారుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. 
 
భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు శుక్రవారం సుజిత్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అతన్ని అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.