సంబంధిత వార్తలు
- కర్నూలు హిట్ అండ్ రన్ కేసు.. జాగింగ్ వెళ్తూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి
- ఆగస్టు 15న ఏపీ జాబ్ క్యాలెండర్, 3,168 పోస్టులు భర్తీకి రంగం సిద్ధం
- జూలై 14, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణ నివేదిక ఎలా వుందంటే?
- ఆమ్లెట్ గొడవతో ఆత్మహత్య.. అత్త వేధింపులు, కోడలు ఉరేసుకుని బలవన్మరణం
- ఏలేరు జలాశయంపై ఎల్ నినో ప్రభావం.. నీళ్ల కోసం వేచి చూస్తున్న రైతులు
కర్నూలులో విషాదం... జాతీయ రహదారిపై ఏం జరిగింది?
ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జాగింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ను ఓ గుర్తు తెలియని వాహన ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు పట్టణంలోనే ఈ ఘోరం జరిగింది. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి తెల్లవారుజామున బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న జాతీయ రహదారిపై జాగింగ్ చేస్తున్నారు.
ఈ సమయంలో అటుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనం కానిస్టేబుల్‌ను ఢీకొంది. దీంతో వరప్రసాద్ రెడ్డి ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరప్రసాద్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా హత్య చేశారా? లేక ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
