Heavy Rains: ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం
Updated: Tue, 22 Sep 2026 (09:28 IST)
ఉత్తరాంధ్ర తీరం వైపు ఒక తీవ్ర అల్పపీడనం దూసుకొస్తోంది. ఇది సెప్టెంబర్ 23న శ్రీకాకుళం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం సెప్టెంబర్ 24 ఉదయం నుండి తెలంగాణపై పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం సెప్టెంబర్ 25 రాత్రి వరకు కొనసాగవచ్చు. సెప్టెంబర్ 24, 25 తేదీలలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 200 మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల 20-40 మి.మీ. ఈ సమయంలో హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయి.
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
మరింత చదవండి