సంబంధిత వార్తలు
- ఎమ్మెల్యే రోజాకు షాక్.. మనోకు శ్రీముఖి, పూర్ణ ముద్దులు.. ఫ్యూజులు ఎగిరిపోయాయి..
- నగరి ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు!
- నగరి ఎమ్మెల్యే రోజాకు శస్త్రచికిత్స.. రెండు వారాల పాటు ఎవ్వరూ రావొద్దు..
- #HBDMadhubala 'తలైవి' చిత్రం నుంచి 'రోజా' హీరోయిన్ ఫస్ట్ లుక్
- రోజా, సెల్వమణికి సన్మానం చేశారు, ఎందుకంటే?
ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది?
గత వారం రోజులుగా ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై వదంతులు ఎక్కువయ్యాయి. ఆమెకు రెండు మేజర్ సర్జరీలు చేశారని.. ఐసియులో ఉన్నారన్నది తెలిసిందే. రోజా భర్త ద్వారా విషయం అందరికీ తెలిసింది.
కానీ రోజా ఆరోగ్య పరిస్థితిపై మాత్రం అభిమానుల్లో ఇప్పటికీ ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోజా ఒక ప్రకటన విడుదల చేశారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ అవుతాను. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇక లేవు.
ఎవరూ ఆందోళనకు గురికావద్దండి.. మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ సేవలో ఉంటాను.. నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నగరి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రకటనలో తెలిపారు రోజా. దీంతో అభిమానుల్లో కాస్త ఆందోళన తగ్గింది.
చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజాకు ప్రముఖుల పరామర్స ఎక్కువైంది. ఫోన్ లోనే అందరూ పరామర్సిస్తున్నారు. అభిమానులెవరినీ ఆసుపత్రి వద్దకు పంపడం లేదు ఆసుపత్రి యాజమాన్యం.
