శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (12:19 IST)

నగరి ఎమ్మెల్యే రోజాకు శస్త్రచికిత్స.. రెండు వారాల పాటు ఎవ్వరూ రావొద్దు..

నగరి ఎమ్మెల్యే రోజా శస్త్రచికిత్స చేయించుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరిన రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. ఐసీయూ నుంచి ఇవాళ వార్డుకు తరలించారు డాక్టర్లు. అయితే రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని రెండు వారాల పాటు విశ్రాంతిలో ఉండనున్నారని తెలిపారు ఆమె భర్త సెల్వమణి. అభిమానులు ఎవరూ హాస్పిటల్‌కు రావొద్దని ఆడియో టేప్ రిలీజ్ చేశారు. 
 
ఆపరేషన్ అనంతరం ఆమెను ఐసీయూ నుంచి రూమ్ కు షిఫ్ట్ చేసినట్లు సెల్వమణి వెల్లడించారు. రెండు వారాలు పాటు ఆమెను కలిసేందుకు ఎవరూ రావొద్దని.. రోజా బాగానే ఉన్నారని పేర్కొన్నారు. రోజాకు ఆపరేషన్ గత ఏడాదే జరగాల్సి ఉందని.. కానీ ఎన్నికలు, కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోందని వివరించారు. రోజాకు శస్త్రచికిత్సలు జరగడంపై అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.