సంబంధిత వార్తలు
- రోజా కబడ్డీ బిల్డప్ రాజకీయం, చిన్నప్పుడు ఆడటంతో కాలు ఆగలేదట...
- రోజా... ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసు
- చీర ఎగ్గట్టి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా!
- నేను నైట్ మాత్రమే వెలుగునిస్తా, జబర్దస్త్ డబుల్ మీనింగ్, ఆపిల్ కొరికాడన్న రోజా
- సైనికులై సాగుదాం, టిడిపిని లేకుండా చేస్తాం: కార్యకర్తలకు రోజా పిలుపు
వైకాపా ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?
వైకాపా ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగానైతే వైసీపీ ఘన విజయం సాధించిందో అదే విధంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రోజా పేర్కొన్నారు.
సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్నారని ఆమె అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కొందరు మీడియా ముందుకు వచ్చి వైసీపీ రక్తం తమలో ప్రవహిస్తోందని చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోందని రోజా విమర్శించారు.
నగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నగరంలోని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని రోజా కోరారు. కొంతమంది నాయకులు తమ అనుచరులను వైసీపీ రెబెల్స్‌గా పోటీకి నిలబెట్టి పార్టీ అభ్యర్థులను ఓడించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
రెబెల్స్ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతానని ఆమె పేర్కొన్నారు. మంత్రి పెద్దరెడ్డిని ఉద్దేశించే రోజా ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తర్వాతి కథనం
