ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (07:10 IST)

చీర ఎగ్గట్టి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా!

చిత్తూరు జిల్లాలోని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్, సినీ నటి రోజా ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా జిల్లా నిండ్రలో కబడ్డీ టోర్నీని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఎంతో ఉత్సాహంగా ఆడారు. 
 
కబడ్డీ కోర్టులో ఉత్సాహంగా కదిలిన రోజాను ఆటగాళ్లు, ప్రేక్షకులు విస్మయంతో తిలరించారు. చీరలో ఉన్నప్పటికీ చీర ఎగ్గట్టిమరీ కబడ్డీ ఆడి, గ్రామీణ క్రీడల పట్ల తన మక్కువను చాటుతూ ఎంతో హుషారుగా కబడ్డీ ఆడారు.
 
దీనిపై రోజా స్పందిస్తూ, తనకిష్టమైన ఆట కబడ్డీ అని తెలిపారు. అందుకే క్రీడాకారులతో కాసేపు ఆడినట్లు చెప్పారు.