టీడీపీ ఎమ్మెల్యే మద్దాల గిరి వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించి హాట్ టాపిక్ అయిన ఆయన.. తాజాగా టీడీపీపై విమర్శలు, ప్రశ్నల వర్షం కురిపించడం చర్చనీయాంశమైంది. నాలుగైదు నెలలుగా టీడీపీలో అనేక మార్పులు చేయాలని అధిష్టానానికి చెబుతున్నా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే వైఖరి కొనసాగితే పార్టీ వీడటానికి నా లాంటి...