సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (20:09 IST)

ఆర్‌కామ్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా

రిలయన్స్ గ్రూప్ చైర్మన్, బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) డైరెక్టర్ అనిల్ అంబానీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం కంపెనీ ప్రకటించింది.

అనిల్‌తోపాటు చాయా విరాని, రైనా కరాణి, మంజరి కాకెర్, సురేశ్ రంగాచార్‌లు కూడా డైరెక్టర్ల పదవుల నుంచి తప్పుకున్నారు. కంపెనీ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన మణికంఠన్ వి ఇప్పటికే రాజీనామా సమర్పించారు.

శుక్రవారం విడుదల చేసిన రెండో త్రైమాసికంలో ఆర్‌కామ్ రూ.30,142 కోట్ల ఏకీకృత నష్టాలు నమోదు చేసింది. దివాలా తీసిన ఆర్‌కామ్ ప్రస్తుతం విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.