1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ISRO Chairman Sivan visits Tirumala

తిరుమల దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్

ISRO
ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్ఎల్వీసీ 51 నమూన రాకెటును శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 10:24 గంటలకు పీఎస్ఎల్వీసీ 51ను నింగిలోకి ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమన్నారు.

ఇస్రో ద్వారా మొదటి కమర్షియల్ ప్రయోగం కూడా ఇదే అని చెప్పారు. రాబోవు రోజుల్లో మరెన్ని రాకెట్‌లను నింగిలోకి ప్రవేశపెడుతామని శివన్ పేర్కొన్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసినవారిలో మొదటివాడు: చంద్రశేఖర ఆజాద్