ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (19:46 IST)

నడకదారి పైకప్పు పనులు త్వరగా పూర్తి చేయండి: టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

చెప్పులు వేసుకోకుండా మైళ్ళ దూరం నడచుకుని వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకునే  సామాన్య భక్తుల కోసం నిర్మిస్తున్న నడక దారి పై కప్పు పనులు త్వరగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతున్న నడక దారి పైకప్పు పనులను శనివారం ఆయన పరిశీలించారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు పనులు ఏప్రిల్ చివరకు పూర్తి చేస్తామని చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి చైర్మన్ కు వివరించారు.

45వ మలువు నుంచి తిరుమల దాకా  జరుగుతున్న పనులను పరిశీలించిన చైర్మన్ వీటిని కూడా బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని సిఈ చెప్పారు.

బ్రహ్మోత్సవాల నాటికి అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి పైకప్పు భక్తులకు అందుబాటులోకి వస్తుందని చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఎస్ ఈ 2 నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.