శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:06 IST)

నకిలీ వెబ్ సైట్ పై చర్యలకు టీటీడీ చైర్మన్ ఆదేశం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడైనా డోర్ డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న www balaji prasadam.com అనే నకిలీ వెబ్ సైట్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
 
శ్రీవారి ప్రసాదాల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వెబ్ సైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం సుబ్బారెడ్డి దృష్టికి వచ్చింది.దీనిపై ఆయన వెంటనే స్పందించారు.

నకిలీ వెబ్ సైట్ వివరాలు సేకరించి సంబంధిత వ్యక్తులపై కేసు పెట్టాలని ఆదేశించారు. ఐటి విభాగం సహాయంతో వెబ్ సైట్ ను బ్లాక్ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.