మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (05:55 IST)

మేమూ జీతాలు తీసుకోలేదు: టీటీడీ ఛైర్మ‌న్

గడ‌చిన వందేళ్ల‌లో ఎన్న‌డూ ఇలాంటి పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో రాలేదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

‘కరోనా’, ‘లాక్ డౌన్’ నేపథ్యంలో భక్తులకు దర్శనాలు ఆపేసి ఇప్పటికి 45 రోజులైంద‌న్నారు. ప్రతి నెలా వచ్చే హుండీ ఆదాయం, సేవా కార్యక్రమాలు, కల్యాణోత్సవాలు, ప్రసాదాలు, రూమ్ రెంట్స్.. ఇలా వీటి ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ.150 నుంచి రూ.175 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని, రాబోయే కాలంలో ఎలా పూడ్చుకోవాలనే విషయమై ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. రాబోయే కాలంలో టీటీడీ ఖర్చులు, వ్యయాలు తగ్గించే విషయమై అధికారులు, ఉద్యోగస్తులు, పాలక మండలి సభ్యులు సహకరిస్తారని ఆశించారు. పాలక మండలి సభ్యులు, చైర్మన్‌గా తాను కూడా జీతాలు తీసుకోలేదని గుర్తుచేశారు.