1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Justice Prashant Kumar Mishra reached Vijayawada

విజయవాడ చేరుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

Justice Prashant Kumar Mishra
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం గౌరవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మంగళవారం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాన్ని అందజేశారు.
 
రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ .పి .సిసోడియా కూడా జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
 
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ,తుమ్మలపల్లి కళా క్షేత్రంలో  జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం గౌరవ ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణ స్వీకారం చేస్తారు.
తర్వాతి కథనం
నాదనీరాజనం వేదికపై ఆక‌ట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు