ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (20:32 IST)

ప‌వ‌న్ కోసం పెట్టిన ప‌రుగులు ఇంటికి ర‌ప్పించింది

Janasena karyakartha with pawan
ఇటీవ‌ల‌ రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ రోడ్ల‌ను శుభ్రంచేసే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హంచారు. ఆయ‌న ఇచ్చిన పిలుపుకు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు చోట్ల పాల్గొని శ్ర‌మ‌దానం చేశారు. ఎ.పి.లో రోడ్లు అద్వాన్నంగా వున్నాయ‌ని జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శించారు. ఆయ‌న రాక‌తో రాజ‌మండ్రిలో పోలీసు బందోబ‌స్తు ముమ్మ‌రం చేశారు. కొన్ని చోట్ల మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు ప‌ర్మిష‌న్ లేద‌ని అడ్డుకున్నారు.
 
ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ రాక‌తో ఆయ‌న అభిమానులు బైక్‌ల‌తో ప‌ర్య‌టించి ఆయ‌న‌కు అండ‌గా నిలిచారు. అందులో భాగంగా ఓ కార్య‌క‌ర్త బైక్‌ఫై ఖాళీలేక‌పోవ‌డంతో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కారువెంబ‌డి ప‌రుగెత్తుకుంటూ వెళ్లి ఆయ‌న చేసే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాన్  త‌న పర్యటనలో కారు వెంట పరిగెత్తిన నిడగట్లకు  చెందిన జనసైనికుడిని ఈరోజు హైదరాబాద్ పిలిపించి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆ అభిమాని ఆనంద‌పార‌వ‌శ్యానికి లోన‌య్యారు.