బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 9 అక్టోబరు 2021 (19:08 IST)

తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది: పవన్‌ కల్యాణ్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఫోర్స్ ని ఎక్క‌డా త‌గ్గించ‌డం లేదు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా, త‌గ్గేదేలే అంటున్నాడు. తెలంగాణాలో ఒక స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ, ఇదే చెప్పుకొచ్చారు. పోరాటం చేస్తేనే అడుగు ముందుకు వేయగలమని తెలుసు... భయపెట్టిన కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు.

చేవెళ్ల అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ‘‘రాజకీయాల్లోకి వస్తుంటే అందరూ నన్ను భయపెట్టారు.. కానీ, తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది. 2009లో రాజకీయాలు నా ఆధీనంలో లేవు. అప్పుడు పార్టీ వేరొకరి చేతిలో ఉంది. రాజకీయ చదరంగంలో జనసేనది సాహసోపేత అడుగు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది. తెలంగాణ ప్రజలకు నేను రుణపడి ఉన్నా. రాజకీయాలకు బలమైన భావజాలం ఉంటే చాలు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.