శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:57 IST)

తాకట్టులో ఆంధ్రప్రదేశ్ : పవన్ కళ్యాణ్ అటాక్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ఏపీ ప్రభుత్వంపై విరుచకుపడ్డారు. 'తాక‌ట్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్' పేరుతో ఆయ‌న ప‌లు వివ‌రాలు పోస్ట్ చేశారు. 'ఎన్ని వాగ్దానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా.. రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు.. ఈ మౌలిక ఆర్థిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది' అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.
 
వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో ఏపీలో ఆర్థికాభివృద్ధి లేద‌ని, న‌వ‌ర‌త్నాల పేరిట మాత్రం వ‌రాలు కురిపిస్తున్నామ‌ని చెప్పుకుంటోంద‌ని ప‌వ‌న్ ఓ గ్రాఫ్ ద్వారా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. రాబ‌డి లేక ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంద‌ని, నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌న్నింటినీ పెంచుతోంద‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు.
 
కాగా, ఇటీవల ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి విషయం తెల్సిందే. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు ఇపుడు నవ కష్టాలుగా మారాయంటూ మండిపడిన విషయం తెల్సిందే. ఇపుడు తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అంటూ విరుచుకుపడ్డారు.