SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి
Mahesh Babu, Odisha Deputy Chief Minister Pravathi Padira
ఇటీవలే SMB29 చిత్రం SS రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా నటిస్తున్న చిత్రం ఒడిశాలోని కోరాపుట్‌లో చిత్రీకరణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కథ రామాయణం నుండి ప్రేరణ పొందినట్లు, మహేష్ బాబు పాత్ర హనుమంతుడు సంజీవని మూలిక కోసం చేసిన అన్వేషణను పోలి ఉంటుందని చిత్ర యూనిట్ తెలియజేస్తోంది. ఇదే విషయాన్ని ఒడిశా ఉపముఖ్యమంత్రి ప్రవతి పదిరా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మా దగ్గర షూటింగ్ జరగడం గర్వకారణంగా వుందని ట్వీట్ చేసింది.
ఇంతకుముందు మల్కాన్‌గిరిలో పుష్ప-2 తర్వాత ఒడిశాలో ఈ చిత్రం షూటింగ్, వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాల కారణంగా పర్యాటక ప్రదేశంగా రాష్ట్రం పెరుగుతున్న ఆకర్షణను హైలైట్ చేస్తుంది. ఇది చలనచిత్ర పరిశ్రమలను ఆకర్షించడానికి ఒడిశా పర్యాటక రంగ ప్రయత్నాలను పెంచుతుంది. మరిన్ని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేసుకున్న సినిమాలకు రాయితీలు ఇస్తామని ఆమె ప్రకటించారు.
సుమారు 900–1,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడుతోన్న SSMB29, అంతర్జాతీయ సాంకేతిక సిబ్బంది, విస్తృతమైన VFXలతో కూడిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం. హైదరాబాద్‌లో చారిత్రక కాశీని పునఃసృష్టించే సెట్‌లతో ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.