చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న చిలుకూర్ బాలాజీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీసా దేవుడు అని అందరూ పిలిచే దైవం అ చిలుకూర్ బాలాజీని దర్శించుకుంటే తమకు తప్పకుండా విదేశీ ప్రయాణం అవకాశం లభిస్తుందనీ, అలాగే తాము చేసే పనిలో విజయవంతమైన ఫలితాలనిస్తారని విశ్వాసం.
చిలుకూర్ బాలాజీ దేవాలయాన్ని సందర్శించాక ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలను పంచుకున్నారు. చిలుకూర్ బాలాజీ ఆశీస్సులతో తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని పేర్కొంది. కాగా ప్రియాంక కొన్ని రోజుల క్రితం లాస్ ఏంజిల్స్ నుండి హైదరాబాద్ చేరుకుంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించనున్న, మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రంలో ప్రియాంక నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.