గురువారం, 13 మార్చి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 12 మార్చి 2025 (23:27 IST)

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

వేడి వాతావరణంలో పుచ్చకాయ కంటే మెరుగైన పండు ఏదీ లేదు. దీనిని తినడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
పుచ్చకాయలోని సిట్రులిన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
కిడ్నీ పనితీరుకు కూడా పుచ్చకాయ మంచిది.
విటమిన్లు సి, ఎ, పొటాషియం, రాగి, కాల్షియం ఇందులో వున్నాయి.
పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పుచ్చకాయ తింటుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.