శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:10 IST)

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్మోహన రెడ్డి

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల‌ సందర్భంగా మంగళవారం మూలా నక్షత్రం రోజున
విజయవాడ కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం
తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. తాడేపల్లి లోని సియం క్యాంపు
కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ముఖ్యమంత్రి దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. 
 
ఇంద్రకీలాద్రికి  చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సామినాయుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, ఆలయ ఈఓ డి. భ్రమరాంబ. స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు,ఆలయ ప్రధానార్చకులు,ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్థానాచార్యులు వి.శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చక ఎల్.దుర్గాప్రసాద్ ముఖ్యమంత్రికి పరివేష్టితం ధారణ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎల్. బధ రీనాథ్, ఉప ప్రధాన అర్చకులు కె.రవికుమార్, బి.శంకర  శాండిల్య, శ్రీనివాస స శాస్త్రి ముఖ్యమంత్రి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు. 
 
 
సరస్వతీ దేవి అలంకారంలో వుండి  భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని సాంప్రదాయ వస్త్రధారణతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతరాలయంలో ఆలయ ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వాచన మండపంలో చింతపల్లి ఆంజనేయ ఘనాపఠి, వి.రామనాధ్ ఘనాపఠి, టి.వెంకటేశ్వరరావు ఘనాపఠి, వేదపండితులు ఆర్.వి.సోమయాజులు, కె.నరసింహమూర్తి, అర్చక కె.గోపాలకృష్ణలు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
 
 
ముఖ్యమంత్రి వెంట దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డా. జి.వాణీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, ధర్మకర్తల మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ అంతరాలయంలోకి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని), కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ముఖ్యమంత్రి  కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీ యండి.కరిమున్నిసా, కల్పలత రెడ్డి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, వల్లభనేని వంశీ, జోగి రమేష్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పుణ్యశీల, తాతినేని పద్మావతి, అడపా శేషు, శ్రీకాంత్, జిల్లా కలెక్టరు కె.నివాస్, నగర్ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవిలత, యల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టరు జి.యస్.యస్. ప్రవీణ్ చంద్, వైఎస్ ఆర్ సిపి నాయకులు దేవినేని ఆవినాష్, భవకుమార్ తదితరులు ఉన్నారు.