సంబంధిత వార్తలు
- కాకినాడలో 'వార్ వన్‌సైడ్'... 25 ఏళ్ల తర్వాత ఎగిరిన పసుపు జెండా
- కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశా.. టీడీపీలో నేను వలసపక్షిని...
- దాంపత్య జీవితం పండాలంటే.. రెడ్ వైన్, పాలకూర, డార్క్ చాక్లెట్ తీసుకోండి..
- నిఖిల్ ఎంగేజ్మెంట్ ఆగిపోయిందట.. కారణం ఏమిటో తెలుసా?
- క్రికెట్ ప్రపంచంలో అద్భుతం : ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన గెలుపు
కాకినాడ గెలుపు చాలా ఆనందాన్ని ఇచ్చింది : మంత్రులతో చంద్రబాబు
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ సంపూర్ణ మెజార్టీని సాధి
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ సంపూర్ణ మెజార్టీని సాధించి మున్సిపాలిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కాకినాడను కైవసం చేసుకోవడంపై చంద్రబాబు తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. కొద్దిసేపటి క్రితం ఫలితాలను మంత్రులతో కలసి సమీక్షించిన ఆయన, గెలుపునకు కృషి చేసిన వారిని అభినందించారు. ఈ ఫలితం తనకు సంతృప్తినిచ్చిందని, ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేద్దామని అన్నారు.
మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి, కళా వెంకట్రావులతో సమావేశమైన చంద్రబాబు, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటివరకూ విడుదలైన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 30, బీజేపీ 3, వైకాపా 9, ఇతరులు 3 స్థానాలను (గెలుపు ప్లస్ ఆధిక్యం) దక్కించుకున్నారు.
