బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (11:56 IST)

చంద్రబాబు అభివృద్ధికి పట్టం కట్టారు... కళా వెంకట్రావు :: విజేతలు వీరే

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుభి మోగించడంపై మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి పట్టంకట్టారని ఆయన వ్యాఖ

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుభి మోగించడంపై మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి పట్టంకట్టారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ... కాకినాడ ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు సమర్థతకు సంకేతమని అన్నారు. గత మూడున్నరేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చంద్రబాబు చేరువయ్యారని, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టాన్నిచూసిన ప్రజలు ఓటు రూపంలో ఇచ్చిన తీర్పే ఈ విజయం అని అన్నారు. ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగిందని, మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళతానని చెప్పారు. 
 
మరో నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వైసీపీ నేతల అవాస్తవ ప్రకటనలు, అసత్య ప్రచారాలను  ప్రజలు నమ్మలేదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. మిత్రపక్షం బీజేపీతో కలిసి పోటీ చేశామని, తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశామని చెప్పారు. 
 
కాగా, ఈ ఎన్నికల్లో గెలుపొందిన విజేతల వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 48 వార్డులుండగా, 48 వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ 32, బీజేపీ 3, వైకాపాకు 10, ఇతరులకు 3 వార్డులు దక్కాయి. గెలుపొందిన వారి వివరాలివి...
 
డివిజన్ 1: పేరాబత్తుల లోవాబాబు (టీడీపీ)
డివిజన్ 2: సత్తిబాబు (టీడీపీ)
డివిజన్ 3: గుత్తుల అచ్చయ్యమ్మ (టీడీపీ)
డివిజన్ 4: పి సూర్యకుమారి (వైసీపీ)
డివిజన్ 5: సుజాత (బీజేపీ)
డివిజన్ 6: బండి సత్యనారాయణ (టీడీపీ)
డివిజన్ 7: అంబటి క్రాంతి (టీడీపీ)
డివిజన్ 8: వరలక్ష్మి (టీడీపీ)
డివిజన్ 9: కే రమేష్ (వైసీపీ)
డివిజన్ 10: మోసా దానమ్మ (టీడీపీ)
డివిజన్ 11: జీ దానమ్మ (టీడీపీ)
డివిజన్ 12: కే సునీత (టీడీపీ)
డివిజన్ 13: బాల కామేశ్వరరావు (టీడీపీ)
డివిజన్ 14: వీ ఉమాశంకర్ (టీడీపీ)
డివిజన్ 15: చినగోటి సత్యబాబు (వైసీపీ)
డివిజన్ 16: మల్లాడి గంగాధర్ (టీడీపీ)
డివిజన్ 17: కే సత్యప్రసాద్ (టీడీపీ)
డివిజన్ 18: సీ రాంబాబు (టీడీపీ)
డివిజన్ 19: పీ అనంతకుమార్ (టీడీపీ)
డివిజన్ 20: సత్యనారాయణ (టీడీపీ)
డివిజన్ 21: బుర్రా విజయకుమారి (వైసీపీ)
డివిజన్ 22: కృష్ణకుమార్ (వైసీపీ)
డివిజన్ 23: శ్రీదేవి (వైసీపీ)
డివిజన్ 24: ఉదయ్ కుమార్ (వైసీపీ)
డివిజన్ 25: కే సీత (టీడీపీ)
డివిజన్ 26: సంగాని నందం (టీడీపీ)
డివిజన్ 27: రాజాన మంగారత్నం (టీడీపీ)
డివిజన్ 28: సుంకర పావని (టీడీపీ)
డివిజన్ 29: వాసిరెడ్డి రాంబాబు (ఇండిపెండెంట్)
డివిజన్ 30: చంద్రకళా దీప్తి (వైసీపీ)
డివిజన్ 31: బంగారు సూర్యావతి (టీడీపీ)
డివిజన్ 32: ఆర్ సత్యనారాయణ (వైసీపీ)
డివిజన్ 33: గుజ్జు దుర్గ (టీడీపీ)
డివిజన్ 34: తహేర్ ఖాతూన్ (టీడీపీ)
డివిజన్ 35: బీ రామకృష్ణ (ఇండిపెండెంట్)
డివిజన్ 36: లక్ష్మీ ప్రసన్న (బీజేపీ)
డివిజన్ 37: లంకె హేమలత (టీడీపీ)
డివిజన్ 38: ఎం శేషుకుమారి (టీడీపీ)
డివిజన్ 39: మల్లిపూడి నాగదీపిక (ఇండిపెండెంట్)
డివిజన్ 40: శివప్రసన్న (టీడీపీ)
డివిజన్ 41: సత్యవతి (బీజేపీ)
డివిజన్ 42: (టీడీపీ)
డివిజన్ 43: పవన్ కుమార్ (టీడీపీ)
డివిజన్ 44: (టీడీపీ)
డివిజన్ 45: (టీడీపీ)
డివిజన్ 46: కోరిమిల్లి బాలప్రసాద్ (టీడీపీ)
డివిజన్ 47: వెంకటలక్ష్మి (వైసీపీ)
డివిజన్ 48: (టీడీపీ)