1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Mohan babu visited Yerpedu munaga palem

మనస్సున్న మారాజు మోహన్ బాబు... ఏం చేశారో తెలుసా?

ఆయనో విలక్షణ నటుడు. మనస్సుకు బాధ కలిగించే ఏ సంఘటన జరిగినా అక్కడికి వెళ్ళిపోతుంటాడు. రాజకీయాలతో సంబంధం లేదు. నటుడిగానే ఆయనకు ఎనలేని గుర్తింపు. ఆయనే సినీనటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఏర్పేడు రోడ్డుప్రమాద ఘటనపై తీవ్రంగా స్పందించారు మోహన్ బాబు. మునగ

Mohan babu visited Yerpedu munaga palem
ఆయనో విలక్షణ నటుడు.  మనస్సుకు బాధ కలిగించే ఏ సంఘటన జరిగినా అక్కడికి వెళ్ళిపోతుంటాడు. రాజకీయాలతో సంబంధం లేదు. నటుడిగానే ఆయనకు ఎనలేని గుర్తింపు. ఆయనే సినీనటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఏర్పేడు రోడ్డుప్రమాద ఘటనపై తీవ్రంగా స్పందించారు మోహన్ బాబు. మునగలపాలెంకు వెళ్ళిన మోహన్ బాబు మృతుల కుటుంబాలను పరామర్శించారు. 
 
15మంది చావుకు కారణమైన వారు కూడా పోవడం ఖాయమని చెప్పారు మోహన్ బాబు. మృతుల కుటుంబాల్లో వారికి తన విద్యాసంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఇస్తానని, పిల్లలుంటే వారిని ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. తన తండ్రి మునగళపాలెంలో టీచర్‌గా పనిచేసిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మోహన్ బాబు ఇలాంటి సంధర్భంలో ఈ గ్రామానికి వస్తానని అనుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తర్వాతి కథనం
150 ఏళ్ల క్రితం అనుభవాన్ని దేశంపై రుద్దాలని ప్రధాని మోదీ ఎందుకు అనుకుంటున్నారు?