సంబంధిత వార్తలు
- కదులుతున్న రైలు నుంచి దిగింది.. అయితే ప్రాణాలతో?
- రైలు పట్టాలపై సిలిండర్ పెట్టాడు.. అంతే ఎగిరిపడింది కానీ.. పేలలేదు..
- ఖాకీ కీచకుడు : మహిళా కానిస్టేబుల్స్ కళ్లెదుటే మహిళా ఖైదీపై రైలు బాత్రూమ్లో రేప్...
- వెంకయ్య చొరవ : గూడూరు - విజయవాడ మధ్య ఇంటర్ సిటీ రైలు
- ఉన్నట్టుండి రైలు ముందు దూకాడు.. దారుణంగా చనిపోయాడు..
ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం వాయిదా
విశాఖ - విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఏసీ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మరణంతో దీన్ని వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 26వ తేదీన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి ప్రారంభించాల్సి ఉంది. అయితే, అరుణ్ జైట్లీ మరణంతో దీన్ని వాయిదావేశారు.
కాగా, ఈ రైలు ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరి, మధ్యాహ్నం 11.15 గంటలకు విజయవాడకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖకు చేరుతుంది. వారంలో 5 రోజులు (గురువారం, ఆదివారం మినహా) మాత్రమే నడిచే ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్ల మాత్రమే ఆగుతుంది.
