1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. no reservation for general compartments of railway

రైల్వే జ‌న‌ర‌ల్ బోగీల్లోకి ఇక య‌థేచ్ఛ‌గా ఎక్క‌వ‌చ్చు...

reservation
రైల్వే సాధార‌ణ ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌. మీరు రైళ్లలోని జనరల్‌ బోగీల్లోకి ఇక కొవిడ్‌కు ముందు మాదిరే య‌ధేచ్ఛ‌గా ప్రయాణం చేయవచ్చు. కోవిడ్ నిబంధ‌న‌ల వ‌ల్ల గ‌తంలో రిజర్వేష‌న్ త‌ప్ప‌ని స‌రి కానీ, ఇపుడు ఆ రిజర్వేషన్‌ అవసరం లేదు.

స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌ కౌంటర్లలో అన్ రిజర్వుడ్‌ టికెట్‌ తీసుకుని రైలెక్కి ప్రయాణం చేయవచ్చు. ఈ నిర్ణయం ఈ నెల 24 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్ర‌స్తుతానికి హైదరాబాద్‌ - పూర్ణ రైలులో మాత్రం 22 నుంచి అమలు చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

జోన్‌ పరిధిలోని 74 రైళ్లలో జనరల్‌ బోగీలను రిజర్వేషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో సికింద్రాబాద్‌ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, గుంటూరులో 5, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో 6, నాందేడ్‌లో 12 రైళ్లున్నాయి.
తర్వాతి కథనం
ముంబై మేయర్ రేసులో సోనూ సూద్.. మిలింద్ సోమన్?