1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Please Remove Jagan’s Photo’, Bharathi Faces A Shock

దయచేసి మా పాస్‌బుక్‌ల నుండి సిఎం ఫోటో తీసేలా చూడండి..

Jagan-Bharati
రైతులు, గ్రామీణ భూ యజమానుల పట్టాదార్‌ పాసు పుస్తకాలపై వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఫొటోను ప్రయోగించడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల చేసిన తప్పుల్లో ఒకటి.
 
 గ్రౌండ్ లెవెల్‌లో ఈ విషయం ఎంత తీవ్రంగా ఉందంటే.. పట్టాదార్ పాస్‌బుక్‌లో జగన్ ఫోటో తీసేసేలా చూడాలని ఓ రైతు వచ్చి అడగడంతో వైఎస్ భారతి స్వయంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.
 
ఈ సంఘటన పులివెందులలో భారతి ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఒక రైతు ఆమె వద్దకు వచ్చి "దయచేసి మా పాస్‌బుక్‌ల నుండి సిఎం ఫోటో తీసేలా చూడండి. పాసు పుస్తకాలపై సీఎం ఫొటో ఉండడం సరికాదు. దయచేసి రైతుల ఫోటోలు మాత్రమే ఉంచండి. అదే సమయంలో అందుకు ఆమె అంగీకరిస్తూ.. తల ఊపుతూ కనిపించారు. 
 
పట్టాదార్‌ పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటోలు పెట్టాలన్న జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ఈ ఫోటోల హంగామా గ్రౌండ్‌ లెవెల్‌లో పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తుండడంతో భారతి స్వయంగా చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ముద్రగడ అనుమతి తీసుకున్న తర్వాత ముద్రగడ క్రాంతిని జనసేనలో చేర్చుకుంటా : పవన్ కళ్యాణ్