1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Posani Krishna Murali Breaks Down Before Judge

బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి

Posani
తనపై అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి వాపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరుష పదజాలంతో దూషించినందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదైవుండగా, ఈ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో కోర్టులో హాజరుపరిచేందుకు కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 
 
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట పోసాని బోరున విలపించారు. తనపై వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఇప్పటికి రెండు ఆపరేషన్లు జరిగాయని, స్టెంట్లు వేశారని గుర్తుచేశారు. 70 యేళ్ల వయసులో తనను ఇబ్బంది పెడుతున్నారు. తప్పు చేస్తే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే శరణ్య. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోసానికి పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై అదులోకి తీసుకోవడంతో విడుదల సాధ్యపడలేదు. 
తర్వాతి కథనం
మా భార్యలు తెగ తాగేస్తున్నారు... పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తలు!!