1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. psycho arrested in palasa

శ్రీకాకుళం జిల్లా పలాసలో సైకో వీరంగం.. వృద్ధుడికి గాయాలు

crime scene
శ్రీకాకుళం జిల్లా పలాసలో సైకో వీరంగం సృష్టించాడు. సైకోను అడ్డుకోబోయిన వాహనదారులపై దాడులు చేశాడు. అటుగా వెళ్తున్న విద్యార్థులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో జడుసుకున్న విద్యార్థులు అక్కడ నుంచి పరుగులు తీశారు. చివరికి సైకోను పట్టుకున్న స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. 
 
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు.. సైకోను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సైకో దాడిలో గాయపడిన వృద్ధుడిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అయోధ్యలో దీపావళి.. దీపోత్సవ్.. మ్యూజికల్ లేజర్ షో.. మోదీ హాజరు