1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. KCR to go to Munugode for Election Campaigning

మునుగోడు ఉప ఎన్నికల పోరు : సీఎం కేసీఆర్ మూడు రోజుల మకాం

kcrao
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే నెల 3వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నిక కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్, ప్రజాశాంతి పార్టీలతో వివిధ పార్టీల అభ్యర్థుల తరపున ఆయా పార్టీ నేతలు, మంత్రులు, పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగివచ్చారు. ఆయన ఇపుడు పూర్తి స్థాయిలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికపై దృష్టిసారించారు. తెరాస అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా, మూడు రోజుల పాటు మునుగోడులోనే ఆయన మకాం వేయబోతున్నారు. 
 
ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఆయన మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడులో రోడ్ షోలు నిర్వహిస్తారు. 31వ తేదీన స్థానికంగా జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాగా, ఈ ఎన్నికలకు నవంబరు ఒకటో తేదీతో ప్రచారం ముగియనుంది. మూడో తేదీన పోలింగ్ నిర్వహించి, ఆరో తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఒక్కొక్కరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా? సీఎం జగన్ ప్రశ్న