శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (18:16 IST)

మునుగోడును అమెరికా చేసి పారేద్దాం.. కేఏ పాల్

KA Paul
KA Paul
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం మునుగోడు పరిధిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేఏ పాల్, ఓ హెటల్‌లో దోశ వేస్తూ కనిపించారు. చేతులతో దోశను కాలుస్తూనే...అక్కడున్న వారితో ఆయన మాట్లాడారు. 
 
ఎన్నికల్లో తనకు ఉంగరం గుర్తును కేటాయించారని కేఏపాల్ అన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికా మాదిరిగా మారుస్తానని తెలిపారు. "ఉంగరం గుర్తుకు ఓటేయండి... మునుగోడును అమెరికా చేసి పారేద్దాం" అంటూ ఆయన తనదైన స్టైల్‌లో చెప్పారు.