శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మునుగోడులో హోరెత్తుతున్న ప్రచారం - గరిటపట్టిన తెరాస ఎమ్మెల్యే

mynampati hanmantha rao
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాయి. దీంతో ప్రచారం హోరెత్తిపోతోంది. 
 
ఈ క్రమంలో జిల్లాలోని చౌటుప్పల్ మండలం ఎల్లంబావి వద్ద తెరాస భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభ ఏర్పాట్లను తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన వంటశాలను సందర్శించి, స్వయంగా గరిటపట్టారు. 
 
అధికార తెరాసకు చెందిన మల్కాజిగిరి ఎమ్మెల్యేగా మైనంపల్లి హన్మంతరావు కొనసాగుతున్న విషయం తెల్సిందే. వంట మనిషిగా మారిపోయారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలో ఈ సభ నిర్వహణ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ సభకు హాజరయ్యే వారికి భోజనం ఏర్పాట్ల కోసం అనేక మంది వంట మనుషులతో ప్రత్యేకంగా భోజనం తయారు చేస్తున్నారు. ఈ భోజనం తయారీలో స్వయంగా పాలుపంచుకున్న హన్మంతరావు గరిట పట్టి వంట పనుల్లో నిమగ్నమయ్యారు.