శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (09:02 IST)

హస్తినలో కేసీఆర్ - జ్వరంతో బాధపడుతున్న సీఎం

kcrao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు హస్తినలో ఉన్నారు. ఆయన అక్కడ జ్వరంతో బాధపడుతూ, అక్కడే చికిత్స పొందుతున్నారు. 
 
న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉంటున్న సీఎం కేసీఆర్ పలువురితో సమావేశమవుతూ మంతనాలు జరుపుతున్నారు. అదేసమయంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం.
 
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రత్యేక సీఎస్ అరవింద్ కుమార్‌లకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పిలుపునిచ్చినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉంటారని చెబుతున్నారు.