మంగళవారం, 20 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (15:06 IST)

హస్తినలో భారత రాష్ట్ర సమితికి తీసుకున్న అద్దె కార్యాలయ ఇదే..

brs office in delhi
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇపుడు జాతీయ పార్టీగా అవతరించింది. దీనికి భారత్‌ రాష్ట్ర సమితిగా (భారాస)గా విజయదశమి పర్వదినం రోజున నామకరణం చేశారు. 
 
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలకు అనువుగా దేశ రాజధాని ఢిల్లీలో సాధ్యమైనంత త్వరగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. తెరాసకు ఢిల్లీ వసంత్‌ విహార్‌లో కేటాయించిన స్థలంలో ఇప్పటికే సొంత భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 
 
ఈ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మరికొంతకాలం పట్టనుంది. అప్పటివరకు అద్దె భవనంలో భారాస కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఢిల్లీ సర్దార్‌ పటేల్‌ మార్గ్‌ సమీపంలోని పాలికా మిలాన్‌ కావెంటర్‌ లేన్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ భవనంలో లోపలి భాగంలో అంతర్గత మార్పులు చేస్తున్నారు.