1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Raghuramakrishna Raju sensational comments on YS Jagan

ముఖ్యమంత్రి జగన్ తడిగుడ్డతో అమరావతి రైతుల గొంతుకోసిన పాపంలో నేనూ భాగస్వామినే: ఆర్ఆర్ఆర్

Raghuramakrishna Raju
రైతుల గొంతుకోసిన పాపంలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానంటూ వైసిపి ఎంపి రఘురామకృష్ణ రాజు అన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అమరావతి రైతులు ఉద్యమాన్ని కొనసాగించారని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
 
రైతుల గొంతుకోసిన పాపంలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానన్నారు. తను తన తప్పు తెలుసుకున్నట్లే సీఎం కూడా తన తప్పు తెలుసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ తడిగుడ్డతో అమరావతి రైతుల గొంతుకోసిన పాపంలో తాను భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
 
చేసిన తప్పుకు క్షమాపణగా రాజధాని ఉద్యమానికి మద్దతు పలికానని స్పష్టంచేశారు. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే ఆశతో అమరావతి రైతులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విప్లవ కవి శ్రీశ్రీ జన్మదినం సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకుపోదామని రైతులకు పిలుపునిచ్చారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు.. కారు బాంబు పేలి 30మంది మృతి