1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Rain with- thundershowers in ap today and tomorrow

24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు

rain
రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం వుంది. 
 
ఈ నెల 25 వరకు కోస్తా రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.
 
విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. ఫలితంగా సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నిన్న రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిశాయి.
 
ఇకపోతే.. ఏపీ రాష్ట్రంలోని అనకాపల్లి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని పది మండలాల్లో శుక్రవారం వడగాల్పులు వీచాయి.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
సింహం నుంచి ఆవులను కాపాడిన వీధి శునకం