గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (17:15 IST)

ఎండవేడి-తిరుమలలో వడగండ్ల వర్షం.. భక్తులకు ఉపశమనం

Tirumala Rain
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వెలసిన తిరుమల కొండపై వడగండ్ల వర్షం కురిసింది. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో తిరుమల వర్షపు నీటితో నిండిపోయింది. 
 
పలు చోట్ల భారీగా వర్షపు నీరు ప్రవహించింది. పలు షాపింగ్ కాంప్లెక్స్ ల్లోకి నీరు ప్రవేశించింది. ఈ వర్షం కారణంగా ఎండవేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించినట్లైంది.