గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (18:56 IST)

హైదరాబాదులో దంచికొట్టిన వడగండ్ల వర్షం..

rain
హైదరాబాదులో వేసవిలో వెదర్ ఛేంజ్ అయ్యింది. వడగండ్ల వాన దంచికొట్టింది. నగరంలోని హైకోర్టు ప్రాంతంతో పాటు.. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది.

పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణమంతా మారిపోయింది. 
 
నాంపల్లి, ఖైరతాబాద్, బేగం బజార్, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తుంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి బీభత్సంగా ఈదురు గాలులు వీస్తూ వడగళ్ల వాన పడడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.