మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (15:10 IST)

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా 800 మూవీ ఫస్ట్ లుక్

Muralitharan  First Loo
Muralitharan First Loo
16 అరుదైన ప్రపంచ రికార్డులతో, వరల్డ్ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఈ స్పిన్ మాంత్రికుడు 2002లో విస్డెన్స్ క్రికెటర్స్ అల్మానాక్ చేత అత్యుత్తమ టెస్ట్ మ్యాచ్ బౌలర్‌గా పేరు పొందారు. 2017లో  ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన మొదటి శ్రీలంక క్రికెటర్ మురళీధరన్.
 
‘’800’’ లెజెండరీ స్పిన్నర్‌పై రూపొందుతున్న బయోపిక్. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ఎం ఎస్ శ్రీపతి. స్లమ్‌డాగ్ మిలియనీర్ మధుర్ మిట్టల్ స్పిన్ మాంత్రికుడి పాత్ర పోషిస్తున్నారు. తెలుగు , తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కెరీర్‌లో 800 టెస్ట్‌ వికెట్స్‌ తీసిన ఏకైక ఆఫ్‌ స్పిన్నర్‌ బౌలర్‌గా అరుదైన రికార్డు మురళీధరన్‌ ఖాతాలో ఉంది. అందుకే ఈ చిత్రానికి చిత్రానికి ‘800’ అనే టైటిల్‌ను పెట్టారు.
 
ఏప్రిల్ 17న మురళికి 51 ఏళ్లు నిండాయి. ప్రత్యేక పుట్టినరోజు కానుకగా, మేకర్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మధుర్ మిట్టల్ మురళీ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. పొట్టి జుట్టు, ఫ్రెంచ్ గడ్డంతో మధుర్ మురళి లాగా కనిపిస్తున్నారు. అతని ముఖంపై బెయిల్స్‌తో వికెట్ల ప్రతిబింబాన్ని మనం చూడవచ్చు. ఈరోజుమోషన్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.
 
ఈ స్పోర్ట్స్ డ్రామా సివిల్ వార్ నడుమ మురళీ చేసిన ప్రయాణం.. అత్యంత విజయవంతమైన బౌలర్‌ గా ఎదిగి, టెస్ట్ మ్యాచ్‌కు సగటున ఆరు వికెట్లు తీసిన అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మారిన జర్నీ ని ప్రజంట్ చేయనుంది.  
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మురళికి తమిళనాడులో మూలాలు ఉన్నాయి. అతని తాతలు భారతీయులు. బ్రిటిష్ వారు అక్కడ టీ తోటలలో పని చేయడానికి వారిని శ్రీలంకకు తీసుకెళ్లారు.
 
శ్రీపతి ఈ చిత్రం గురించి చెబుతూ  “800 అనేది మురళి క్రికెట్ కెరీర్ చుట్టూ ఉన్న కథ మాత్రమే కాదు, మానవ ధైర్యసాహసాల కథ. ఈ చిత్రం తన పట్టుదల, సంకల్పం ద్వారా  అసమానతలకు వ్యతిరేకంగా నిలబడిన ఒక సాధారణ వ్యక్తి లెజెండ్‌గా మారిన స్ఫూర్తిదాయకమైన కథ. ‘800’ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అనేక కోణాలని చూపిస్తుంది. అతను యుద్ధంలో దెబ్బతిన్న శ్రీలంక నుండి క్రికెట్ ఐకాన్, ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ టేకర్ అయ్యారు. క్రికెట్ గురించి ఏమీ తెలియని వారికి, ఇది ఉత్కంఠభరితమైన, టచ్చింగ్ అండర్ డాగ్ కథ. మురళి గందరగోళ కెరీర్‌ని అనుసరించిన వారికి, ఇది మైథాలజీ వెనుక ఉన్న వ్యక్తిని చూపుతుంది.’’అన్నారు
 
మురళి 214 టెస్ట్ మ్యాచ్‌లలో రికార్డు స్థాయిలో 1,711 రోజుల పాటు టెస్ట్ బౌలర్ల ICC ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 2004లో వెస్టిండీస్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్‌ను, 2007లో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్‌ను అధిగమించి టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రెండు సంవత్సరాల తరువాత, 2009లో, కొలంబోలో వసీం అక్రమ్ 502 వికెట్లని అధిగమించి కొత్త వన్డే రికార్డును నెలకొల్పాడు.
 
ఆస్కార్ విన్నింగ్ స్లమ్‌డాగ్ మిలియనీర్‌లో సలీమ్ మాలిక్ పాత్రలో తన నటనకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న  ఈ ఆకాశం రావడం పై ఆనందం వ్యక్తం చేశాడు. “మురళీధరన్ లాంటి లెజెండ్ కథను తెరపైకి తీసుకురావడం గౌరవంగా భావిస్తున్నాను. అతను క్రికెటర్‌గా మనందరికీ తెలుసు, కానీ జీవితంలో విజయం సాధించడానికి అసమానతలను అధిగమించిన వ్యక్తిగా అతని గురించి సినిమాలో చాలా ఉన్నాయి.  ఇది దశాబ్దాలుగా తరతరాలుగా యువకులకు స్ఫూర్తినిస్తుంది." అని చెప్పారు.