శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (10:56 IST)

ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్న సుడిగాలి సుధీర్!!

Rashmi Gautham, Sudheer
బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌గా చెరగని ముద్రవేసుకున్న సుధీర్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నారు. సుడిగాలి సుధీర్, బుల్లితెర యాంకర్ రష్మీల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం సాగుతోంది. ఇపుడు ఈ ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పెడుతూ సుడిగాలి సుధీర్ ఓ పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తనకు వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబుతున్నట్టు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 
 
'జబర్దస్త్' షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.. కమెడియన్‌గా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను కూడా మెప్పించారు. ఆయన హీరోగా "గాలోడు" అనే చిత్రం కూడా వచ్చింది. తన తోటి కమెడియన్స్ అందరూ పెళ్ళి చేసుకుని సెటిలైపోతున్నప్పటికీ సుడిగాలి సుధీర్ మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకుని రాలేదు. ముఖ్యంగా, యాంకర్ రష్మీతో సుధీర్‌కు లఫ్ అఫైర్ ఉందనే ప్రచారం జరిగింది. ప్రచారం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ గట్టిగా నమ్మారు కూడా. దీనికి కారణం వారిద్దరూ బయట ఎంతో చనువుగా ఉండటమే కారణం. 
 
ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకోబుతున్నారంటూ చెబుతున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే సుడిగాలి సుధీర్ క్లారిటీ ఇవ్వాల్సివుంది.