మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (19:27 IST)

సుడిగాలి సుధీర్, అనసూయకు చుక్కలు చూపించిన స్టార్ మా?

Anasuya
జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన అనసూయ మరియు సుడిగాలి సుధీర్ స్టార్ మాలో రచ్చరచ్చ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సుధీర్, అనసూయ ఆ షో నుంచి వెళ్లిన కొన్ని వారాలకే ఆ కార్యక్రమాన్ని ఎత్తివేశారు. 
 
అసలు ఆ కార్యక్రమం లేకుండా చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ స్టార్ మా పరివార్ అంటూ శ్రీముఖి యాంకర్‌గా ఆ స్లాట్ లో వేరే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాంతో అనసూయ-సుధీర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ మాని నమ్ముకుని వస్తే ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఫైర్ అయ్యారు. 
 
జబర్దస్త్ శ్రీదేవి, డ్రామా కంపెనీలతో సుధీర్ ఒక స్టార్‌గా వెలుగు వెలుగుతున్నాడు. ఇక జబర్దస్త్‌లో చేసిన సమయంలో అనసూయకు మంచి సంపాదన వుండేదన్న సంగతి తెలిసిందే.