గురువారం, 22 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (22:43 IST)

పవన్ కల్యాణ్ తర్వాత ఆ హీరోనే.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్.. పీకే ఫ్యాన్స్ ఫైర్

hyper aadi
జబర్దస్త్ షోలో స్కిట్లతో అదరగట్టే హైపర్ ఆది గురించి తెలిసిందే. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి నోరెత్తి.. ఆయన ఫ్యాన్సు కోపానికి కారకుడయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందింటే? 
 
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమా "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్ర ప్రమోషన్స్ కోసం ఆది వెళ్లాడు. ఈ షోలో కిరణ్ గురించి ఆది మాట్లాడుతూ "బేసిక్‌గా నాకు పవన్ కళ్యాణ్ గారంటే బాగా ఇష్టం. ఆయన మాట విన్నా, ఆయన పాట విన్నా నోటికి తెలియకుండా అరుపులు, చేతికి తెలియకుండా చప్పట్లు, వేళ్లకు తెలియకుండా విజిల్స్ వస్తాయి.
 
నాకు తెలిసి మళ్లా ఆ స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉంటే అది కిరణ్ అబ్బవరం"  చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆది కామెంట్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆది కామెంట్స్‌పై పీకే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తీవ్రపదజాలంతో ఆదిని ఏకిపారేస్తున్నారు.