ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (15:34 IST)

పవన్ కల్యాణ్ అంటే నాకెంతో ఇష్టం.. చట్టసభకు వెళ్లాలి.. పరుచూరి

pawan kalyan
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. పవన్ కల్యాణ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. అతడి ఆశయం నెరవేరాలని కోరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ గెలుపొంది చట్టసభల్లోకి వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకూ 27 సినిమాలు మాత్రమే చేశాడు. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. 
 
ఏదో ఒక పార్టీలో ఉండి.. పార్లమెంట్ లేదా అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచన వేరు.. సమాజాన్ని మార్చాలనే ఆశయం వేరు. ఆ ఆశయం పవన్‌లో ఉంది. అన్నగారు (ఎన్టీఆర్‌) మాదిరిగా ఈయన ఆశయం కూడా బలమైన ప్రతిపక్షం ఉండాలనే. ఎన్నికల్లో నిలబడగానే గెలుస్తాం, ముఖ్యమంత్రులమైపోతాం అనేది తర్వాత విషయం. మన మాట సభల ద్వారా ప్రజలకు తెలియజేయాలని పరుచూరి అన్నారు.
 
ఈ సమాజాన్ని బాగుచేయడానికి మన వంతు కృషి చేయాలి అనే ఆలోచన గొప్పది. అదే విషయాన్ని పవన్‌ గత కొంత కాలంగా చెబుతున్నారు. ఎవరు కలిసి వచ్చినా? రాకపోయినా తన పోరాటం తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడని కొనియాడారు.