గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (19:13 IST)

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో వైకాపా ఎమ్మెల్యే అన్నదానం (video)

ysrcp mla annadanam
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 2వ తేదీన జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆయన అభిమానులు వివిధ ప్రాంతాల్లో అన్నదానాలతో పాటు వివిధ సంక్షేమ సహాయాలను పంపిణీ చేశారు. ఇందులోభాగంగా, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో జరిగిన అన్నదాన కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇపుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
వైకాపా పాలనతో పాటు ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌ వైకాపాతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా, వచ్చే ఎన్నికల తర్వాత మరోమారు వైకాపా అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని బహిరంగంగానే ప్రకటించారు. 
 
అలాంటి వైకాపా, పవన్ కళ్యాణ్‌ల మధ్య టగ్‌ఆఫ్ వార్ జరుగుతున్న సమయంలో పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు నిర్వహించిన అన్నదానం వేడుకల్లో వైకాపా ఎమ్మెల్యే పాల్గొనడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.