గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (14:21 IST)

10న బాలయ్య పుట్టినరోజు వేడుకలు - భారీ అన్నదానానికి ఏర్పాట్లు

Balakrishna
అనంతపురం జిల్లా హిందుపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 62వ పుట్టిన రోజు వేడుకులను ఈ నెల పదో తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా, గుంటూరులో భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ అన్నదానంలో ఏకంగా 15 వేల మందికి అన్నదానం చేస్తామని ఎన్టీఆర్ యూఎస్ఏ ప్రతినిధి ఉయ్యూరు శ్రీనివాస్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ శతజయంతి వేడుకులను పురస్కరించుకుని గుంటూరులో బాలకృష్ణ చేతుల మీదుగా అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్టు చెప్పారు. గుంటూరులో అన్ని డివిజన్లలో భారీగా అన్నదానం చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో సుమారుగా 15 వేల మందికి అన్నదానంతో పాటు వివిధ సంక్షేమ సహాయాలను పంపిణీ చేస్తామని తెలిపారు.