శ్రేయ చరణ్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్
అందాల నటి శ్రేయ అగ్రనటి. రజనీకాంత్‌తో సహా దక్షిణాది అగ్రహీరోల్లో శ్రేయ కలిసి నటించింది. విదేశీ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న శ్రేయ పెళ్లికి తర్వాత కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అవకాశాలు తగ్గినా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో టచ్‌లో వుంది ఈ బ్యూటీ. శ్రేయకు జనవరి 2021లో రాధ అనే పాప పుట్టింది. పాప పుట్టినా శ్రేయకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల విడుదలైన పాన్ ఇండియా చిత్రం కబ్జాలో నటించింది. ఇలా వరుస సినిమాల్లో కమిట్ అవుతున్న శ్రేయ తరచూ తన ఫోటోషూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. తాజాగా గోల్డ్ కలర్ షైనింగ్ డ్రెస్‌లో మోడ్రన్‌గా కనిపించే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.