గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (12:07 IST)

హైదరాబాద్ నగరంలో దారుణం ... మాజీ విలేకరిని కిడ్నాప్ చేసి చంపేశారు...

crime scene
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. మాజీ విలేకరిని కిడ్నాప్ చేసి చంపేశారు. మాజీ విలేఖరిని కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ ఘట హైదరాబాద్ శివారు ప్రాంతమైన కొత్తూరు పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు... మల్లాపూర్ గ్రామానికి చెందిన మామిడి కరుణాకర్ రెడ్డి (29) ఓ పత్రికలో విలేకరిగా పనిచేసేవాడు. కొద్దినెలల క్రితమే మానేశాడు. ప్రస్తుతం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తన ఇంటి పక్కన ఉండే శ్రీధర్ రెడ్డితో కలిసి కారులో చేగూరు నుంచి తిమ్మాపూర్ వైపు వస్తుండగా మార్గంమధ్యలో తీగాపూర్ వద్ద కాపు కాసిన దుండగులు వారిని అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేశారు.