1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 'Raithu Bharosa Scheme' will launch in Nellore on 15th

15న నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభం

Raithu Bharosa Scheme
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో ‘రైతు భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు.

రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలుగు గంగ అధికారులతో చర్చించి.. తెలుగు గంగ పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
రవాణాశాఖలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి