శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (12:39 IST)

నెల్లూరు రొట్టెల పండుగ రివర్స్ టెండరింగ్ లో అక్రమాలు

ఈ నెలలో జరగబోతున్న నెల్లూరు బారా షహిద్  బాబా రొట్టెల పండుగ సందర్భంగా నిర్వహించిన  రివర్స్ టెండరింగ్ ద్వారా ఇరవై లక్షల వక్ఫ్  ఆదాయానికి గండి కొట్టిన  టెండర్ ను తక్షణమే రద్దు చేసి న్యాయ విచారణ చేపట్టాలని 
యునైటెడ్  ముస్లిమ్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కన్వినర్ అల్తాఫ్ రాజా మరియు  ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఖాజావలి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి  సిఫార్సుల రహిత పాలన అందిస్తామని ఒకవైపు సిఎం వైఎస్ జగన్  చెబుతుండగా మరోవైపు దానికి భిన్నంగా జరగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గాలో ఏటా జరిగే రొట్టెల పండుగకు ఎంతో ఘన చరిత్ర ఉంది.

ఈ సందర్భముగా దర్గాల్లో భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన షాపుల ఏర్పాటు కొబ్బరికాయల అమ్మకాలు హుండీ తదితర వాటి కోసం ఈ ఏడాది జులై 30 న విజయవాడలోని వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఈ-టెండర్లను ఓపెన్ చేసి బిడ్డర్లను ఖరారు చేశారు.

ఈ టెండర్ను రు. 92.47.786  సయ్యద్ గౌస్ భాషా దక్కించుకున్నారు. ఏదైనా కారణముంటే రెండవ స్థానంలో ఉన్న బిడ్డర్ ను ఖరారు చేయాల్సి ఉంది.  కానీ దానికి భిన్నంగా అధికార దర్పంతో ఏకంగా టెండర్లనే రద్దు చేసి షార్ట్ టెండర్ పిలవడంపై వక్ఫ్ బోర్డు రు 22.47 నష్టపోవాల్సి వచ్చిందని  ఏటా రెండు కోట్ల పైనే ఆదాయం వచ్చే రొట్టెల పండుగలో వక్ఫ్ బోర్డు తన ఇష్టారాజ్యంగా తమ అనుకూలమైన వారికి  టెండర్లు ఖరారు చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తారు. 

జూలై 30 న  ఖరారైన టెండర్లలో  రు 70.00.786 బిడ్డింగ్తో చివరి స్థానంలో ఉన్న వ్యక్తికి షార్ట్ టెండర్ దక్కడం పట్ల ఎవరి హస్తముందో తెలియాల్సి ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే టెండర్ను రద్దు చేసి న్యాయ విచారణ జరిపి అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని  తెలియజేశారు.

ప్రభుత్వానికి నష్టదాయకంగా ఉన్నాయంటూ గత ప్రభుత్వ హయాంలో ఖరారైన టెండర్లను రద్దు చేసి రీ టెండర్లు పిలవాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని విజయవాడ కేంద్రంగా వక్ఫ్ బోర్డు ఆదాయానికి గండి కొడుతున్న విషయంపై ఏ విధంగా స్పందిస్తారో ?