శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (12:26 IST)

9వేల కొబ్బరికాయలతో గణేశుడు

9వేల కొబ్బరికాయలతో 30 అడుగుల ఎత్తున్న గణేశ్ విగ్రహాన్ని భక్తులు రూపొందించిన ఉదంతం బెంగళూరులో వెలుగుచూసింది.

పుట్టెంగల్లీ ప్రాంతానికి చెందిన 70 మంది భక్తులు 20 రోజుల పాటు శ్రమించి 9వేల కొబ్బరికాయలతో పర్యావరణ హిత గణేశ్ విగ్రహాన్ని తయారు చేశారు. కొబ్బరికాయలతో గణనాథుడిని తయారు చేసిన భక్తులు 20 రకాల కూరగాయలతో దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు.

పర్యావరణహిత గణేశుడిని తయారు చేయాలనే లక్ష్యంతో తాము దీన్ని రూపొందించామని భక్తుడు మోహన్ రాజు చెప్పారు. దీంతోపాటు నిపుణులైన వంటవారితో టన్ను హల్వాను తయారు చేసి గణేశ్ వద్ద పెట్టామని మోహనరాజు చెప్పారు.

వినాయక ఉత్సవాలు 5 రోజుల పాటు చేసిన తర్వాత పర్యావరణహిత గణేశుడిని తొలగించి కొబ్బరికాయలు, కూరగాయలు, హల్వాను భక్తులకు పంపిణీ చేస్తామని రాజు వివరించారు.